📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణPeddapalliప్రతిభకు ప్రోత్సాహం.. ప్రభుత్వ బడికి గౌరవం

ప్రతిభకు ప్రోత్సాహం.. ప్రభుత్వ బడికి గౌరవం

📰 Generate e-Paper Clip

ప్రతిభకు ప్రోత్సాహం.. ప్రభుత్వ బడికి గౌరవం

రామగిరి,మన సమగ్ర ప్రజావాణి ఆగస్టు 15

రామగిరి మండలం సుందిల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 530 మార్కులు సాధించిన పూజను అభినందించి సన్మానించారు.గ్రామానికి చెందిన శ్రీశైలం కుమార్తె పూజ పదో తరగతి ఫలితాల్లో 530 మార్కులు సాధించడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు,గ్రామ పెద్దలు,విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.ఆమెను ప్రోత్సహించేందుకు ఉపసర్పంచ్ జానగామ సదానందం రూ.5 వేల నగదు బహుమతిని అందజేశారు.ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ మంచి మార్కులు సాధించిన విద్యార్థినిని ప్రోత్సహించడం ద్వారా ఇతర విద్యార్థుల్లోనూ చదువుపై ఆసక్తి పెరుగుతుందని పలువురు పేర్కొన్నారు.ఈ సందర్భంగా సుందిల్ల గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గర్రేపల్లి ప్రవీణ్ గౌడ్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను కూడా అభినందించారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఉన్నత లక్ష్యాల వైపు నడిపించడంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు.
ప్రభుత్వ బడిలో చదివి ప్రతిభ చాటిన విద్యార్థినికి నగదు ప్రోత్సాహకం అందించడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.ఇలాంటి ప్రోత్సాహకాలు మరింత మంది విద్యార్థులను ఉన్నత ఫలితాల సాధన దిశగా నడిపిస్తాయని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారి ప్రతిభను ప్రోత్సహించడమే విద్యాశాఖ లక్ష్యాల్లో ఒకటిని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోరకొప్పుల తిరుపతి గౌడ్,మల్లారెడ్డి, వార్డు సభ్యులు రామగిరి స్టాలిన్, కొడమళ్లా రవి,గర్రెపల్లి నరేష్ గౌడ్,రామగిరి మల్లయ్య, దేవాలయ కమిటీ సభ్యుడు రేకుంట్ల రవి,విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.