📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్గుగ్గిళ్ల సబ్‌స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు త్యాగధనుల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం –...

గుగ్గిళ్ల సబ్‌స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు త్యాగధనుల ఫలితంగానే మనకు స్వాతంత్ర్యం – లైన్మెన్ మల్లయ్య

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, ఆగస్టు 15 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ సబ్‌స్టేషన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సబ్‌స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను లైన్మెన్ మల్లయ్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాటం, త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని గుర్తు చేస్తూ,స్వాతంత్ర్య సమరయోధుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.అనంతరం విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎల్‌ఎం రాజశేఖర్, జూనియర్ లైన్మెన్ మేడిపల్లి నరేష్, వీడబ్ల్యూ శ్రావణ్, సబ్‌స్టేషన్ ఆపరేటర్లు ఆంజనేయులు, రాజు, చంద్రం, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.