📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguమందలింపు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య

మందలింపు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

మందలింపు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య
గుట్టలగంగారం లో విషాదం – చెట్టుకు ఉరి వేసుకున్న రాహుల్
తల్లి మాట వినకపోవడంతో మనస్థాపం
చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు మృతి
ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ శ్రీకాంత్ ((ప్రజావాణి)

కన్నాయిగూడెం మండలం గుట్టలగంగారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
కోడే రాహుల్ (22) తన పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు.
సమాచారం ప్రకారం రాహుల్ మద్యం సేవిస్తుండడంతో తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన అతడు ఇంటి నుంచి వెళ్లిపోయి పొలం వద్దకు చేరుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని దించి శవపంచనామా నిర్వహించారు.
తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్ తెలిపారు.

ప్రజావాణి ద్వారా గమనిక: మానసిక ఒత్తిడి, సమస్యలు ఉంటే కుటుంబ సభ్యులతో మాట్లాడండి. అవసరమైతే సహాయం తీసుకోండి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.