కల్లేపల్లి ప్రాథమిక పాఠశాలకు బుర్ర దత్తాత్రేయ గౌడ్ సేవ
బెజ్జంకి, ఆగస్టు 12 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని కళ్లేపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలకు అదే గ్రామానికి చెందిన బుర్ర దత్తాత్రేయ గౌడ్ ప్రింటర్‌ను విరాళంగా అందజేశారు. తాను చిన్ననాట చదువుకున్న పాఠశాలకు తన వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రింటర్‌ను అందించినట్లు తెలిపారు.
విద్యార్థులకు భవిష్యత్తులో అవసరమైన ఏ వస్తువైనా తన వంతు సహాయం అందిస్తానని దత్తాత్రేయ గౌడ్ తెలిపారు. పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిగుల్లా మోహన్, ఉపసర్పంచ్ శేషి గౌడ్, ప్రధానోపాధ్యాయులు నజీర్, వార్డు సభ్యురాలు బుర్ర పద్మ, కాంగర్ల మోహన్, బుర్ర తిరుపతి గౌడ్, బుర్ర శ్రావణ్ గౌడ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

