వెల్లంపల్లి లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన ఎస్ ఐ అమూల్య
టేకుమట్ల/ప్రజావాణి
టేకుమట్ల మండలం వెలంపల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్సై అమూల్య ఆధ్వర్యంలో గ్రామంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల వివరాలను పరిశీలించారు.గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను అరికట్టేందుకు తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అమూల్య సూచించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. తెలంగాణ రాజకీయాలు
తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొని గ్రామంలోని పలు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూర వెంకటరాజిరెడ్డి, గ్రామస్తులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

