📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్గురుకులమా.నరకకూపమా?పురుగుల అన్నం.మురుగు నీరే దిక్కు!రొ ళ్ల అంబేద్కర్ బాలుర గురుకులంలో దారుణ పరిస్థితులు

గురుకులమా.నరకకూపమా?పురుగుల అన్నం.మురుగు నీరే దిక్కు!రొ ళ్ల అంబేద్కర్ బాలుర గురుకులంలో దారుణ పరిస్థితులు

📰 Generate e-Paper Clip

నీటి కోసం తోపులాటలాడుతున్న విద్యార్థులు

పట్టించుకోని అధికారులు.. చేతులెత్తేసిన ప్రిన్సిపాల్;

శ్రీ సత్యసాయి జిల్లా:(ఆగస్టు10 ప్రజావాణి)రొ ళ్ల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తాయని నమ్మి చేర్పించిన తల్లిదండ్రులకు అక్కడ ఎదురవుతున్న దారుణ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థుల పట్ల నరకప్రాయంగా మారింది. కనీస సౌకర్యాలు కరువై, అనారోగ్యకరమైన వాతావరణంలో విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్న వైనంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం,ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పురుగుల అన్నం.కడగని పాత్రలు!
పాఠశాలలో విద్యార్థులకు పెట్టే భోజనం అత్యంత అధ్వాన్నంగా ఉంటుందని పిల్లలు వాపోతున్నారు. వంట చేసే సమయంలో కనీసం బియ్యాన్ని కూడా కడగకుండా అలాగే వండుతున్నారని,దీంతో అన్నంలో పెద్ద ఎత్తున పురుగులు వస్తున్నాయని విద్యార్థులు తమ తల్లిదండ్రుల వద్ద కన్నీరు మున్నీరయ్యారు. అంతకంటే ఘోరం ఏమిటంటే,రాత్రి సమయంలో వంట చేసిన పాత్రలను కనీసం శుభ్రం చేయకుండా,మరుసటి రోజు ఉదయం మళ్లీ అదే పాత్రలలో వంటలు కానిచ్చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు.ఈ అపరిశుభ్ర ఆహారాన్ని తినలేక పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు.
తాగేందుకు మురుగునీరే శరణ్యం.. సంపుల్లోకి దిగుతున్న పిల్లలు
ఈ గురుకులంలో నీటి కొరతవర్ణనాతీతంగా మారింది. తాగునీటి సరఫరా లేకపోవడంతో చిన్న పిల్లలు సైతం ప్రాణాలకు తెగించి నీటి సంపుల లోకి దిగుతున్నారు. బాటిళ్లతో సంపుల్లోని నీటిని ముంచుకుని, దాహం తీర్చుకోవడానికి అదే నీటిని తాగుతున్నారు.(పై చిత్రంలో చూస్తున్నట్లుగా) మండుటెండలో విద్యార్థులంతా ఒకే చోట చేరి నీటి కోసం తీవ్రంగా అవస్థలు పడుతున్నారు.మరోవైపు పాఠశాల ఆవరణలోని వాటర్ హెడ్ ట్యాంక్ సమీపంలో నిలిచిపోయిన మురుగునీటిలోనే విద్యార్థులు తాము తిన్న ప్లేట్లను కడుక్కుంటున్నారంటే ఇక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.పాఠశాల పరిసరాల్లో ఎక్కడ చూసినా అపరిశుభ్రతే తాండవిస్తోంది.
సిబ్బంది లేరంటూ ప్రిన్సిపాల్ చేతులెత్తేయడంపై ఆగ్రహం
ఈ దారుణాలపై విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్‌ను నిలదీయగా,ఆయన బాధ్యతారహిత్యంగా సమాధానం చెప్పడం గమనార్హం.పాఠశాలలో వంట చేయడానికి,శుభ్రం చేయడానికి సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారని,ఉన్న సిబ్బందితోనే ఎలాగోలా వంట చేయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.”సిబ్బందిని నియమించమని పై ను ఎన్నిసార్లు అడిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు, నేనేం చేయాలి?” అంటూ ప్రిన్సిపాల్ ఎదురు ప్రశ్నిస్తూ చేతులెత్తేయడం గమనార్హం.
ఉన్నతాధికారులు స్పందించాలి: తల్లిదండ్రుల డిమాండ్
ఈ అస్తవ్యస్త పరిస్థితులపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.జిల్లా కలెక్టర్,గురుకుల విద్యాలయాల సంస్థ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రొళ్ల అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించాలని డిమాండ్ చేస్తున్నారు.అక్కడ క్షేత్రస్థాయి పరిశీలన జరిపి,తక్షణమే అదనపు సిబ్బందిని నియమించాలని,తాగునీటి సమస్యను పరిష్కరించి,విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.