గురుకులమా.నరకకూపమా?పురుగుల అన్నం.మురుగు నీరే దిక్కు!రొ ళ్ల అంబేద్కర్ బాలుర గురుకులంలో దారుణ పరిస్థితులు

నీటి కోసం తోపులాటలాడుతున్న విద్యార్థులు పట్టించుకోని అధికారులు.. చేతులెత్తేసిన ప్రిన్సిపాల్; శ్రీ సత్యసాయి జిల్లా:(ఆగస్టు10 ప్రజావాణి)రొ ళ్ల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తాయని నమ్మి చేర్పించిన తల్లిదండ్రులకు అక్కడ ఎదురవుతున్న దారుణ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థుల పట్ల నరకప్రాయంగా మారింది. కనీస సౌకర్యాలు కరువై, అనారోగ్యకరమైన వాతావరణంలో విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్న వైనంపై విద్యార్థుల...