📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedakసోషల్ మీడియా కన్వీనర్‌గా నరేష్ నాయక్‌కు బాధ్యతలు

సోషల్ మీడియా కన్వీనర్‌గా నరేష్ నాయక్‌కు బాధ్యతలు

📰 Generate e-Paper Clip

సోషల్ మీడియా కన్వీనర్‌గా నరేష్ నాయక్‌కు బాధ్యతలు
రామాయంపేట: భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా నరేష్ నాయక్‌కు సోషల్ మీడియా కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ బాధ్యతలను బీజేపీ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ మరియు ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాములు నాయక్ చేతుల మీదుగా నరేష్ నాయక్‌కు అధికారికంగా అప్పగించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు, పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలు ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, పార్టీ కార్యకలాపాలను క్షేత్రస్థాయి నుంచి ప్రజలకు చేరేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

oplus_2097184

సోషల్ మీడియా కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నరేష్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాములు నాయక్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, నాయకుల సందేశాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేలా పనిచేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నరేష్ నాయక్‌కు అభినందనలు తెలిపారు. నూతన బాధ్యతలతో పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని మరింత చురుకుగా ముందుకు తీసుకెళ్లాలని వారు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.