* హర్ ఘర్ తిరంగాను ఊరు రా చేపట్టాలి.*!.
నస్రుల్లాబాద్ ఆగస్టు 10 (ప్రజావాణి) నసురుల్లాబాద్ మండల పరిధిలో సోమవారము
శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం నిర్వహణపై ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది.
దేశభక్తి, జాతీయ ఐక్యతను ప్రజల్లో మరింతగా పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని మండల ప్రజల సహకారంతో విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యక్రమ నిర్వహణ విధానం తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేలా ప్రజలను ప్రోత్సహించాలని, యువత, మహిళలు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా అవగాహన కల్పించాలని నాయకులు సూచించారు. జాతీయ జెండా పట్ల గౌరవం, దేశభక్తి భావన ప్రతి ఒక్కరిలో పెంపొందేలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.
కార్యక్రమం లో బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మండ్లు మండల ఇచ్చార్జ్ మోహన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు పైడిమల్ లక్ష్మి నారాయణ, ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సతీష్, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ , మండల ఉపాధ్యక్షులు శేఖర్, ఓబీసీ మండల అధ్యక్షులు భాస్కల సాయిలు, దళిత మోర్చా మండల అధ్యక్షులు గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షులు భీమరి భాస్కర్, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు చౌవాన్ రాందాస్, మామిళ్ళ గంగారెడ్డి, బూత్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యస్వామి, కంది మల్లేష్, బతిని రాజు, సంతోష్, సాయి కుమార్,శివ కుమార్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

