📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaబొమ్మకల్లులో ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ నూతన కమిటీ ఏర్పాటు

బొమ్మకల్లులో ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ నూతన కమిటీ ఏర్పాటు

📰 Generate e-Paper Clip

 

 

 

బొమ్మకల్లులో ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ నూతన కమిటీ ఏర్పాటు

ప్రజావాణి నడికూడా ఆగస్టు 9

కరీంనగర్ రూరల్: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ నూతన కమిటీల నిర్మాణంలో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లు గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి జాతీయ నాయకుడు రుద్రారం రామచంద్ర మాదిగ, కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంద రాజు మాదిగ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

 

ప్రత్యేక ఆహ్వానితులుగా దండు అంజయ్య మాదిగ, దండు వరలక్ష్మీ మాదిగ హాజరై సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మాదిగలు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించి ముందుకు సాగాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు.

 

సమావేశంలో కొమ్ముల రాజమల్లు మాదిగ, గాలి వెంకన్న మాదిగ, ఘోష్కి శంకర్ మాదిగ, ఎర్రోళ్ల ప్రసాద్ మాదిగ, దండు సరస్వతి, సాన కనకమ్మ, తార, కోరుకంటి రాజమ్మ, శనిగరం శారద, మాట్ల సుకన్య, కుమ్మరి మల్లమ్మ, నీళ్ల సుశీల తదితరులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

 

జై మాదిగ.. జై మందకృష్ణ మాదిగ..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.