📄 ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialపీజీ ఎంట్రన్స్ లో రెండవ ర్యాంక్ సాధించిన అంజన్న

పీజీ ఎంట్రన్స్ లో రెండవ ర్యాంక్ సాధించిన అంజన్న

📰 Generate e-Paper Clip



ప్రజావాణి న్యూస్.లక్షేట్టిపేట, ఆగష్టు 7: ఇటీవల కాకతీయ యూనివర్సిటీ నిర్వహించిన తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ లో పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి కూన అంజన్న జూవాలజీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంక్ సాధించినట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నూర్ కు చెందిన కూన అంజన్నకు జూవాలజీ సబ్జక్ట్ అంటే ఎంతో ఇష్టమని, జీవుల పుట్టుక, నిర్మాణం, పర్యావరణ విద్యపై ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండటమే కాకుండా ఏమైనా సబ్జక్ట్స్ డౌట్స్ ఉంటే అడిగేవాడని డాక్టర్ చంద్ర శేఖర్ గుర్తు చేశారు. పట్టుదల, అంకిత భావంతో చదువుకుంటే యూనివర్సిటీ ర్యాంక్ లు సాధిస్తారని పేర్కొన్నారు. తనకు రాష్ట్ర స్థాయిలో ఈ ర్యాంక్ రావడానికి కారణమైన అధ్యాపకులకు అంజన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular