**
ఆటో బ్యాటరీ చోరీ కేసును ఛేదించిన జోగిపేట పోలీసులు – నలుగురు నిందితుల అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనం
* సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్
* సబ్ ఇన్స్పెక్టర్ గిరి శ్రీకాంత్
మన సమగ్ర ప్రజావాణి ఆగస్టు 07 జోగిపేట సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
జోగిపేట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైం నం. 193/2026, భారతీయ న్యాయ సంహిత ( బి ఎన్ ఎస్ ) సెక్షన్లు 331(4), 305 కింద నమోదైన ఇంటి చోరీ కేసును జోగిపేట పోలీసులు ఛేదించి, నలుగురు నిందితులను అరెస్టు చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
జోగిపేట సీఐ అనిల్ కుమార్
మాట్లాడుతూ
04-08-2026 రాత్రి సమయంలో అందోల్ మండలం, డాకుర్ గ్రామానికి చెందిన పశువుల షెడ్ ప్రహరీ గేటు తాళాన్ని పగులగొట్టి లోపలికి ప్రవేశించిన నిందితులు, అక్కడ పార్క్ చేసి ఉన్న TS-07-UA-7236 నంబర్ గల ఆటోను దొంగిలించేందుకు ప్రయత్నించారు. ఆటోను తీసుకెళ్లడం సాధ్యం కాకపోవడంతో అందులోని సుమారు రూ.5,000 విలువైన ఆటో బ్యాటరీని చోరీ చేసి పరారయ్యారు.
బాధితుడు షేక్ మహబూబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోగిపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గురువారం తెల్లవారుజామున పోలీసులు పటిష్ట వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో, ఎస్ఐ గిరి శ్రీకాంత్, పీసీ అరవింద్ రాథోడ్ మరియు హెచ్జీ సురేష్ తలేల్మ గ్రామం సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక ఆటోను ఆపి తనిఖీ చేశారు. ఆటోకు ముందు, వెనుక భాగాల్లో ఉన్న నంబర్ ప్లేట్లు గుర్తుపట్టకుండా ఉండే విధంగా బురద పూసి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అందులో ఉన్న నలుగురిని విచారించగా, వారు సదరు నేరాన్ని చేసినట్లు అంగీకరించారు.
అరెస్టు చేసిన నిందితులు:
మహమ్మద్ గౌస్ పాషా (ఏ -1) – అంబర్పేట్, హైదరాబాద్
మహమ్మద్ షఫీ అహ్మద్ (ఏ -2) – ఫలక్నుమా, హైదరాబాద్
మహమ్మద్ జమీలుద్దీన్ (ఏ -3) – స్వస్థలం రంజోల్ గ్రామం, జహీరాబాద్ మండలం
బాగ్లీ మైనొద్దీన్ (ఏ -4) – స్వస్థలం భూత్కూర్ గ్రామం, వట్పల్లి మండలం
నిందితుల వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వస్తువులు:
రూ.5,000 విలువైన చోరీకి గురైన ఆటో బ్యాటరీ
ఒక ఇనుప రాడ్డు
ఒక స్క్రూడ్రైవర్
నేరానికి ఉపయోగించిన ఆటో
నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు
దర్యాప్తులో ఏ -1, ఏ -3 మరియు ఏ -4లు పాత నేరస్థులు (హ్యాబిట్యుయల్ ఆఫండర్స్ ) అని, వీరిపై హైదరాబాద్, సైబరాబాద్ మరియు సంగారెడ్డి జిల్లాల పరిధిలో పలు ఆస్తి నేరాల కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడైంది. అలాగే మిగతా నిందితులపై కూడా ఇతర కేసులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది అని సీఐ అనిల్ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.





