ఘట్కేసర్, ఆగస్టు 5: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించిన ముగ్గురు వ్యక్తులపై ఘట్కేసర్ పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు.
పోలీసులు వారిని గౌరవనీయులైన ఎల్.బి. నగర్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, కోర్టు వారికి జరిమానా విధించడంతో పాటు మూడు రోజుల పాటు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సామాజిక సేవ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా ఘట్కేసర్ పోలీసులు మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై ఇకపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రజలు శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని, ఇటువంటి సంఘటనలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.




