📄 ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్మాల మహిళ భూమిని కాజేయాలని చూసిన దుండగుడు 

మాల మహిళ భూమిని కాజేయాలని చూసిన దుండగుడు 

📰 Generate e-Paper Clip

ఎల్లనూరు (ఆగస్టు 03ప్రజావాణి) మండలం చింతకాయ మంద గ్రామానికి చెందిన అనిమెల రమణమ్మ వైఫ్ ఆఫ్ అనిమెల చిన్న మల్లేష్ అనే మహిళ ఈమెకు చెందిన ఒక ఎకరా 6 సెంట్లు భూమి అదే గ్రామానికి చెందిన తలారి మండ్ల నాగరాజు సన్నాఫ్ నాగప్ప అను వ్యక్తికి మూడు సంవత్సరాల లీజు అగ్రిమెంట్ భూమిని రూ 3.50.000/ లు కు వ్రాయించారు. కానీ అనిమెల రమణమ్మకు చదువు రాదని ఆమెతో ఈ అగ్రిమెంట్ ఎవరూ చదవకూడదు నేను చెప్పినట్లు వింటే అగ్రిమెంట్ చేసుకుంటాను అని అన్నాడు అదేవిధంగా చదువురాని మహిళ అతను శాశ్వత అగ్రిమెంటు దాన విక్రయం కింద అని రాపించుకొని సంతకం పెట్టించుకున్నాడు.రెండు సంవత్సరాల తర్వాత తరువాత ఈ విషయం తెలుసుకున్న రమణమ్మ నన్ను అమాయకురాలుని చేసినావు అందుకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు నాయకులు తో అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీస్ పి జి ఆర్ యస్ లో కంప్లైంట్ చేశాము.నన్ను మోసం చేసాడు తలారి నాగరాజు ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను.ఇందులో పాల్గొన్నవారు ఉరుముల కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పూలకుంట రాము అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలు సాకే శ్రీదేవి,జిల్లా ఉపాధ్యక్షులు సాకే గోవర్ధన్ ఉరుముల కళాకారుల సీనియర్ నాయకులు మేడాపురం నరసింహులు,రాప్తాడు నియోజకవర్గం అధ్యక్షులు విజయ్ కుమార్,జిల్లా కమిటీ సభ్యుడు పూలకుంట ఉరుమల నాగరాజు,అందరము సహకారం తెలిపాము.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular