ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు జరిగే వారోత్సవాలను పస్రా 4 మరియు వడ్డెరి గూడెం అంగన్వాడి కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడి టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, తల్లులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
*తల్లిపాల ప్రయోజనాలపై అవగాహన*
కార్యక్రమంలో వైద్య సిబ్బంది మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డకు ఒక గంట లోపు తల్లిపాలు ఇవ్వాలి. మొదట వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. అవి చిక్కగా పసుపు రంగులో ఉంటాయి. వీటిని బిడ్డ త్రాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి వస్తుంది అని తెలిపారు.ఇంకా తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లి-బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది. తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. గర్భాశయం యధాస్థానానికి వస్తుంది. రెండు బిడ్డల మధ్య ఎడము పెరుగుతుంది అని వివరించారు.
పాల్గొన్న వారు*
పస్రా 4 అంగన్వాడి కేంద్రంలో: టీచర్ పద్మారాణి, ఆయా రాజ్యం, తల్లులు
వడ్డెరి గూడెం అంగన్వాడి కేంద్రంలో: ANM సంపూర్ణ, టీచర్ భాగ్యమ్మ, ఆయా కల్పన, ఆశా వర్కర్ రమణమ్మ, తల్లులు, గ్రామస్తులు, చిన్నారులు పాల్గొన్నారు.
*బై రిపోర్టర్: గొల్లపెల్లి లక్ష్మీ*



