📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadతెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి.

📰 Generate e-Paper Clip

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి.

ఆయన అకాల మరణం తెలంగాణ ప్రజానికానికి తీరని లోటనీ స్మరణ.

కోటగిరిలో పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘనంగా శ్రద్ధాంజలి.

 

కోటగిరి/ప్రజావాణి:-తెలంగాణ ఉద్యమకారుడు,మలిదశ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో నిర్విరామంగా పోరాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన స్వర్గీ య మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని కోటగిరి మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తేల్ల రవికుమార్ మాట్లాడుతూ. స్వరాష్ట్ర సాధనలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన పోరాటాలు మరువలేనివని కొనియాడారు.ఆయన అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడతాయని గుర్తు చేశారు.పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎవరైనా నమస్కారం పెడితే ఆయన తిరిగి నమస్కారం పెట్టడనీ,చాలా గర్విష్టిని అని అంటుంటారని. కానీ అసలు విషయం ఉద్యమ సమయం లో పోలీసులు వాటర్ క్యాన్ లతో కొట్టడంతో తన కుడి కన్ను పూర్తిగా చూపు కోల్పోయిందని,అందువల్లే చాలా మంది నమస్కారం పెట్టినా తనకు కనిపించక తిరిగి నమస్కారం చేయలేకపో యానని భావోద్వేగంతో చెప్పడం తనలో ఉన్న లోపాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడని గొప్ప నేత అని అన్నారు.అలాంటి గొప్ప వ్యక్తి నేడు మన మధ్య లేకపోవడం నిజంగా తీరని లోటని,రాబోయే తరాలకు పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ఆయన ఆశయాలకు అండగా నిలుస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోరే సులోచన కిషన్,పిఎసిఎస్ కోటగిరి వైస్ చైర్మన్ బొట్టె గజేంధర్,వార్డు మెంబర్స్ సాజిదా బేగం నజీర్,కమ్మరి గగన్, అంబటి సౌజన్య గంగా ప్రసాద్ గౌడ్,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మట్టపతి దేవేందర్ రావు,శ్రీనివాస్ గౌడ్,షేక్ ఘాన్సీ,సుద్దులం విజయ్,శంకర్ గౌడ్,కప్ప సంతోష్, కన్నం సాయిలు,యోగి,శివకుమార్,గూడుమియా,రుద్రంగి సందీప్,జలాల్,మంజునాథ్,వడ్ల ఉమాకాంత్,రహీం, గంగాధర్,మొగులప్ప,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.