📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaసర్ కార్యక్రమంలో నడికూడ మండలం రాష్ట్రంలో రెండవ స్థానం- ఆదర్శ బి.ఎల్.ఓలకు సన్మానం

సర్ కార్యక్రమంలో నడికూడ మండలం రాష్ట్రంలో రెండవ స్థానం- ఆదర్శ బి.ఎల్.ఓలకు సన్మానం

📰 Generate e-Paper Clip

సర్ కార్యక్రమంలో నడికూడ మండలం రాష్ట్రంలో రెండవ స్థానం- ఆదర్శ బి.ఎల్.ఓలకు సన్మానం

 

*నడికూడ, జూలై 31 (ప్రజావాణి):*

ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన “సర్” నడికూడ మండలం రాష్ట్రంలో రెండవ స్థానం సాధించింది. ఈ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన బూత్ లెవల్ ఆఫీసర్లు (బి.ఎల్.ఓలు)ను మండల రెవెన్యూ అధికారి మరియు మండల అభివృద్ధి అధికారి గురువారం సన్మానించారు.

 

ఎన్రోల్మెంట్ ప్రక్రియను గడువు కంటే ముందుగానే సమర్థవంతంగా పూర్తి చేసి, 100% లక్ష్యాన్ని చేరుకున్నందుకు గుర్తింపుగా కౌకొండ గ్రామానికి చెందిన ఎం.డి. కామ్రూన్, సర్వాపూర్ గ్రామానికి చెందిన మినుగు కల్పనలను శాలువాలతో సత్కరించి, ప్రశంసాపత్రాలు అందజేశారు.

 

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, “సర్” కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి, అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లను ఓటర్ జాబితాలో చేర్చడానికి బి.ఎల్.ఓలు చూపిన నిబద్ధత, సమయపాలన అభినందనీయమన్నారు. వారి కృషి ఫలితంగానే మండలం రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. వారి సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు.

 

ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సిబ్బంది, బి.ఎల్.ఓలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.