📄 ePaper
Saturday, August 1, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేసిన- గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ మల్లయ్య

అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేసిన- గుగ్గిళ్ల గ్రామ సర్పంచ్ మల్లయ్య

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, ఆగస్టు 1 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ అంగన్వాడీ కేంద్రంలో శనివారం చిన్నారులకు యూనిఫాంల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేశారు.అనంతరం అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ యంత్రాన్ని ప్రారంభించి,చిన్నారులకు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్‌కు సూచించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మల్లయ్య మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధిలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ దూగ్యాని లావణ్య–మోహన్, గ్రామపంచాయతీ కార్యదర్శి వంశీధర్, వార్డు సభ్యులు పోతూ భూలక్ష్మి, ర్యాకం అనిత, అంగన్వాడీ టీచర్ భారతి, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, వీవోఏ లక్ష్మణ్, కరాబర్ అశోక్, ఆశా వర్కర్ రజిత, గుగ్గిళ్ల రాజేష్, అంగన్వాడీ ఆయా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular