📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను మూసివేస్తే ఢిల్లీ తరహా ఉద్యమం తప్పదు, ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆర్పిఎస్ఆర్ పి...

రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను మూసివేస్తే ఢిల్లీ తరహా ఉద్యమం తప్పదు, ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆర్పిఎస్ఆర్ పి ఎస్

📰 Generate e-Paper Clip

జూలై 31ప్రజావాణి రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను మూసివేస్తే ఢిల్లీ తరహా ఉద్యమం తప్పదు, ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆర్పిఎస్ఆర్ పి ఎస్ నంద్యాల జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్ పి ఎస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు పెరుగు శివకృష్ణ,జిల్లా అధ్యక్షులు బిజినవేముల శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించి సంక్షేమ పథకాలు అన్నిటిని పక్కన పెట్టేసి ఉపాధి లేకుండా చేసింది ప్రస్తుత ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించి అన్ని రకాల పథకాలను కొనసాగిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయినా కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు,ప్రస్తుతం ఏపీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలను మూసివేయాలనే దురుద్దేశం మీకు ఎలా పుట్టింది?ఇలాంటి దుర్మార్గమైన చర్యలను ఉన్మాద చర్యలను కొనసాగిస్తే మీ ప్రభుత్వ పతనం తప్పదు.పేద పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించాలనే సదుద్దేశంతో 1984 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ ఎన్టీ రామారావు గారు ఆనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్సార్ శంకరన్ గారి సలహా మేరకు రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది.అందులో ఎంతోమంది పేద విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరిన వారు ఉన్నారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ పేరుతో 1).తిరుపతి జిల్లా కో,2).తాడికొండ-అమరావతి ప్రాంతం,3).విశాఖ జిల్లా మేఘాద్రి గడ్డ ప్రాంతాలలో ఉన్నటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మూసివేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించడం సరైన చర్య కాదు,గురుకులాలలో చదువుకునే పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడమే అవుతుంది,ప్రస్తుతం ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో మరియు జూనియర్ కళాశాలలో సరైనటువంటి బోధన సిబ్బంది లేక విద్యార్థుల ఉత్తీర్ణత శాతం కూడా పడిపోతూ ఉన్నది,ప్రస్తుతం ఉన్నటువంటి ఐఐటీ నీటి అకాడమీ లలో మరియు పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకు సరియైన బోధన సిబ్బందిని నియమించండి,సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ పేరుతో మీరు తీసుకొస్తున్నటువంటి ఐఐటీ నీట్ అకాడమీ లకు కొత్త భవనాలు నిర్మించి వాటికి సరైన సమయంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించి ఉత్తమమైన బోధన సిబ్బందిని నియమించాలని ప్రస్తుతం అక్కడ నడుస్తున్నటువంటి పాఠశాలలను యధా స్థితిలో కొనసాగించాలని లేనిపక్షంలో ఢిల్లీలో జరిగిన ఉద్యమం రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో జరగవచ్చు అదే మీ ప్రభుత్వ పథకానికి నాంది పలకవచ్చు.అని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ పి ఎస్ జిల్లా నాయకులు మనోహర్,రామయ్య, జగదీష్, ఖాదర్,వసంత్,రాజు,రమణ,నాగేష్,అబ్దుల్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.