సముద్రంలో కలిసిన ప్రతి నీటి చుక్కహుజురాబాద్ నియోజకవర్గంలోనిరైతు కళ్లలో కన్నీటి చుక్కగా మారింది
* ఇది ప్రకృతి కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరవు
* ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
జమ్మికుంట జులై 29 (ప్రజావాణి)
తెలంగాణ ప్రజలుముఖ్యమంత్రి మీరు కన్నేపల్లి పంప్‌హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి ఉంటేఆ నీరు అన్నారం బ్యారేజ్ సుందిళ్ల ఎల్లంపల్లి నందిమేడారంమిడ్ మానేరు మీదుగా ఎస్‌ఆర్‌ఎస్‌పీకి అలాగే మల్లన్నసాగర్‌కు చేరే అవకాశం ఉండేది కానీ లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలో కలిసిపోవడంతో మా ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారుఇది ప్రకృతి తీసుకొచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరవు అని అన్నారునేను ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలోని సిర్సపల్లి గ్రామంలో ఉన్నాను ఇక్కడ వరి సాగు ఎక్కువగా జరుగుతుంది కానీ నీటి కొరత కారణంగా పొలాలు బీడుగా మారాయి రైతులు నాట్లు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడిందిఅంతేకాదు నీటి కోసం బావులను క్రేన్ వాడే పరిస్థితి కి వచ్చింది బావుల్లో నీరు లేదు ఈ పరిస్థితి రైతుల దుస్థితిని స్పష్టంగా తెలియజేస్తోంది
కాబట్టి హుజురాబాద్ నియోజకవర్గ రైతుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరుతున్నాను దయచేసి కన్నేపల్లి పంప్‌హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించి మా ప్రాంతానికి సాగునీరు అందించండి మా రైతాంగాన్ని ఆదుకుని పంటలను కాపాడండిమా రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్న
సముద్రంలో కలిసిన ప్రతి నీటి చుక్కహుజురాబాద్ నియోజకవర్గంలోనిరైతు కళ్లలో కన్నీటి చుక్కగా మారింది
RELATED ARTICLES




