*ఎబిడిఎం కింద మోడల్ జిల్లాగా యాదాద్రి భువనగిరి ఎంపిక…*
*జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్ షాప్ ను ప్రారంభించిన కలెక్టర్.*
*హాజరైన రాష్ట్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్,మిషన్ డైరెక్టర్ రాష్ట్ర ఎబిడిఎం మిషన్ డైరెక్టర్ డా. సంగీత సత్యనారాయణ ఐఎఎస్.*
*జూలై 29 మన ప్రజావాణి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి పెంట బాలరాజు.*
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక చేపట్టిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రం లో తొలి మోడల్ జిల్లాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎంపికైన సందర్భంగా, బుధవారం రోజు జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎబిడిఎం మోడల్ జిల్లా ప్రారంభోత్సవ వర్క్‌షాప్ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సాంప్రదాయ బద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్‌షాప్‌ను ఘనంగా ప్రారంభించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర గేయం “జయ జయహే తెలంగాణ” ఆలాపనతో కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. అనంతరం రాష్ట్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ , మిషన్ డైరెక్టర్ , రాష్ట్ర ఎబిడిఎం మిషన్ డైరెక్టర్ డా. సంగీత సత్య నారాయణ ఐఎఎస్ వర్క్‌షాప్‌ను ప్రారంభించగా , నేషనల్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ డా. పంకజ్ కుమార్ అరోరా వర్చువల్ ద్వారా పాల్గొని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రాము ఖ్యత పై కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మిషన్ డైరెక్టర్ డా. సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాను తొలి ఏబీడీఎం మోడల్ జిల్లాగా ఎంపిక చేయడం అభి నందనీయమని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆరోగ్య సంస్థలు 100 శాతం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలుకు కట్టుబడి పని చేయాలని సూచించారు. ప్రతి రోగికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ రూపంలో నమోదు చేయడం ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా వారి వైద్య చరిత్రను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రతి పౌరునికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో , అదే విధంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడీ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ , ప్రైవేటు ఆరోగ్య సంస్థలు సమిష్టిగా కృషి చేసి ఏబీడీఎంను విజయ వంతంగా అమలు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ , హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ నమోదులను విజయ వంతంగా పూర్తి చేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. రాబోయే మూడు నెలలకు సంబంధించిన కార్యా చరణ ప్రణాళికను సమర్థ వంతంగా అమలు చేసి ప్రతి అర్హుడికి ఏబిహెచ్ఎ ఐడి సృష్టించడం, ప్రభుత్వ , ప్రైవేటు ఆరోగ్య సంస్థలన్నింటిలో డిజిటల్ ఆరోగ్య సేవలను పూర్తి స్థాయిలో అమలు చేయడం , ప్రతి పౌరుడి ఆరోగ్య వివరాలను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేయడం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ అధికారి డా. ఎం. మనోహర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలి ఏబీడీఎం మోడల్ జిల్లాగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 4,02,949 ఏబిహెచ్ఎ ఐడిలు , 815 మంది ఆరోగ్య సేవల నిపుణుల నమోదులు , 570 ఆరోగ్య సంస్థల నమోదులు , 120 ఏబీడీఎం-సామర్థ్యమున్న ఆరోగ్య సంస్థలు , 5.50 లక్షలకు పైగా డిజిటల్ ఆరోగ్య రికార్డుల అను సంధానం , డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద రూ. 47.23 లక్షల ప్రోత్సాహకం సాధించడం జిల్లాకు గర్వకారణమని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేటు ఆరోగ్య సంస్థల్లో 100 శాతం హెచ్ఎఫ్ఆర్ , హెచ్పిఆర్ ధృవీకరణ , ఏబీడియం-సామర్థ్యమున్న హెచ్ఎంఐఎస్ అమలు, ఏబిహెచ్ఎ ఆధారిత రోగుల నమోదు , డిజిటల్ ప్రిస్క్రిప్షన్లు , ల్యాబ్ నివేదికలు , డిశ్చార్జ్ సమ్మరీలు , డిజిటల్ ఆరోగ్య రికార్డుల అను సంధానం , ఆరోగ్య సిబ్బందికి నిరంతర శిక్షణ ద్వారా సామర్థ్యాభివృద్ధి మరియు విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
వర్క్‌షాప్‌లో ఇంటిగ్రేషన్, డిజిటల్ ఆరోగ్య రికార్డుల నిర్వహణ , రోగి సమ్మతి ఆధారిత డేటా షేరింగ్ , డిజిటల్ ప్రిస్క్రిప్షన్లు మరియు ఆరోగ్య సేవల డిజిటలైజేషన్‌పై నేషనల్ హెల్త్ అథారిటీ , రాష్ట్ర ఎబిడియం బృంద సభ్యులు సమగ్ర అవగాహన కల్పించారు.
జిల్లాలో ఏబీడియం అమలుకు సంబంధించిన మూడు నెలల కార్యా చరణ ప్రణాళికను జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ అధికారి డా. ఎం. మనోహర్ , రాష్ట్ర ఏబీడీఎం బృంద సభ్యురాలు డా. సూర్యశ్రీ రావు సమావేశంలో సమర్పించారు. ఈ కార్య క్రమం ద్వారా జిల్లాలోని అన్ని ఆరోగ్య సంస్థలు డిజిటల్ ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు వేగ వంతమైన , పారదర్శక మైన , నాణ్యమైన , నిరంతరాయ వైద్య సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు.
కార్యక్రమం అనంతరం ధన్యవాదాలు తెలియజేసి జాతీయ గీతాలాపనతో వర్క్‌షాప్ ముగిసింది. ఈ కార్యక్రమంలో విశేష కృషి చేసిన జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ అధికారులు , రాష్ట్ర , జిల్లా ఏబీడీఎం బృంద సభ్యులు , ప్రోగ్రాం నిర్వాహకులు,సమన్వయ కర్తలను అభినందిస్తూ అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హెల్త్ అథారిటీ ప్రతి నిధులు , రాష్ట్ర ఎబిడిఎం బృంద సభ్యులు , జిల్లా వైద్య & ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారులు డా. రామకృష్ణ , డా. వీణ , డా. సుమన్ కళ్యాణ్ , డా. వంశీకృష్ణ , నోడల్ ఆఫీసర్ డా. అశ్విన్ కుమార్ , ప్రభుత్వ ఆసుపత్రుల మెడికల్ అధికారులు , ప్రభుత్వ , ప్రైవేటు ఆసు పత్రుల వైద్యులు , మేనే జింగ్ డైరెక్టర్లు , మెడికల్ సూపరింటెండెంట్లు , క్లినిక్‌లు , డయాగ్నస్టిక్ సెంటర్ల ప్రతినిధులు , ఫార్మసీ ప్రతినిధులు , సాఫ్ట్‌వేర్ సంస్థల ప్రతి నిధులు , ఆరోగ్య సేవల నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





