📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyగురు పౌర్ణిమ పర్వదినాన ప్రత్యేక పూజలు భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న సింధు ఆదర్శ్ రెడ్డి

గురు పౌర్ణిమ పర్వదినాన ప్రత్యేక పూజలు భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న సింధు ఆదర్శ్ రెడ్డి

📰 Generate e-Paper Clip

•గురు పౌర్ణిమ పర్వదినాన ప్రత్యేక పూజలు.. భక్తులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న సింధుఆదర్శ్ రెడ్డి

 

పటాన్చెరువు,జూలై 29 (ప్రజావాణి): గురు పౌర్ణిమ సందర్భంగా పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి, భారతి నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి అమీన్‌పూర్ డివిజన్ పరిధిలోని సాయి కాలనీలో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో నిర్వహించిన గురు పౌర్ణిమ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు పాలాభిషేకం, పుష్పార్చన, హారతి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.

 

అనంతరం భారతి నగర్ డివిజన్ పరిధిలోని మాక్ సొసైటీ, ఓల్డ్ ఎంఐజీ కాలనీల్లో నిర్వహించిన గురు పౌర్ణిమ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువుల ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. గురువుల బోధనలు సమాజానికి మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ వాటిని ఆచరణలో పెట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మాజీ కౌన్సిలర్ బాల్‌రాజ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జగన్నాథ్ రెడ్డి, మాక్ సొసైటీ కమిటీ సభ్యులు మల్లేష్ యాదవ్, రవీందర్ రెడ్డి, ఓల్డ్ ఎంఐజీ కాలనీ కమిటీ సభ్యులు అనిత, ప్రసాద్, రాజు, మాజీ కౌన్సిలర్ నాగమణి, సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, రాకేష్, మునీందర్, లక్ష్మి తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.