📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadభారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ముంపు  ప్రాంతాల ప్రజలను సురక్షిత చోటికి తరలించాలి

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ముంపు  ప్రాంతాల ప్రజలను సురక్షిత చోటికి తరలించాలి

📰 Generate e-Paper Clip

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత చోటికి తరలించాలి..
వాగులు వంకలు దాటే సాహసం చేయొద్దు.
అన్ని శాఖలు నిరంతరం సమన్వయంతో పని చేయాలి
                                తహసిల్దార్ శ్రీనివాసులు
ప్రజావాణి,ఇనుగుర్తి: వాతావరణ శాఖ సూచన మేరకు రానున్న 36 గంటల్లో భారీ వర్షాలు కురవన్న నేపథ్యంలో ఉండాలని ఇనుగుర్తి మండల ప్రజల ప్రజలతో పాటు అన్ని శాఖల అధికారులకు తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు చించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
భారీ వర్షాల పరీస్తితులు దృష్టిలో వుంచుకొని అన్ని శాఖల అధికార్లు సమన్వయంతో పని చేస్తూ,ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.హెచ్చరికల దృష్ట్యా అందరూ తమ కార్యాలయాలలో అందుబాటులో ఉండాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్షం వహించకుండా పరిస్తితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
వరద ముంపుకు గురియ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చెయ్యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
భారీ వరద ప్రవాహ సమయంలో నదులు,వాగులు, కాలువలు,చెరువులు వంటి జల వనరుల వద్దకు వెళ్ళకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.నీటి ప్రవాహాన్ని దాటేందుకు ఎట్టి పరీస్తితిలోను ప్రయత్నించ వద్దుని సూచించారు.రహదారులు,కల్వర్టుల పై నీరు ప్రవహిస్తున్న సమయం లో అత్యంత అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు.
భారీ వర్షాల కారణంగా, సాగునీరు కలుషితమయ్యే అవకాశాన్ని దృష్టిలో వుంచుకొని సురక్షిత తాగు నీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు చెయ్యాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
వ్యవశాయ శాఖ అధికారులు రైతులకు వర్షాల నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రతలపై ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందించాలని గ్రామీణ నీటి సరపరా అధికారులు తాగునీటి సరఫరాకు ఎటువంటి అంతరాయం తలెత్తకుండా చూడాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన సందర్భం లో ఆసుపత్రిలో వైద్యసేవలకు ఆటంకం కలుగకుండా అవసరమైన ప్రత్యామ్యాయ ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.
ప్రసవ సమయం సమీపించిన గర్భినీలను ముందుగానే సమీప ఆసుపత్రులు లేదా గర్భిణీ వసతి కేంద్రాలకు తరలించి అవసరమైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు యం.పి.డి.వో,జి పి వో, పంచాయతి సెక్రెటరీ,సర్పంచ్ లు, కారోబార్ లకు టెలీ కాంఫెరన్సు ద్వారా రాబోయే పరీస్థితులను వివరిస్తూ అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయము తో పని చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.