📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి

📰 Generate e-Paper Clip

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి

పెనుమూరు (ప్రజావాణి ప్రతినిధి)జూలై 27

పెనుమూరులో ఈగల్ టీం ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై విస్తృత అవగాహన
చిత్తూరు జిల్లా, పెనుమూరు:డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. భవిష్యత్తును కాపాడుకోండి

పెనుమూరులో ఈగల్ టీం ఆధ్వర్యంలో మత్తు పదార్థాలపై విస్తృత అవగాహన
చిత్తూరు జిల్లా, పెనుమూరు:
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి లక్ష్యాలపై దృష్టి సారించాలని చిత్తూరు ఈగల్ టీం, పెనుమూరు పోలీసులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పెనుమూరు మండలంలోని సి.ఎస్.అగ్రహారం, పులిగుండు, ఉగ్రనంపల్లి గ్రామాల్లో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పెనుమూరు ఎస్సైతో పాటు చిత్తూరు ఈగల్ టీం సభ్యులు కుమార్, గిరి పాల్గొని గ్రామస్తులు, విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యం, కుటుంబం, విద్య, ఉపాధి, సమాజంపై కలిగే దుష్పరిణామాలను వివరించారు. డ్రగ్స్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే ఎదురయ్యే చట్టపరమైన చర్యల గురించి కూడా అవగాహన కల్పించారు.
“డ్రగ్స్ వద్దు – చదువు ముద్దు” అనే నినాదంతో యువత మంచి అలవాట్లు అలవరచుకుని ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా గంజాయి లేదా డ్రగ్స్ విక్రయం, వినియోగానికి సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే డయల్ 1972 లేదా 112కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మత్తు పదార్థాల నిర్మూలనకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.