📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసంగెం మండల కేంద్రంలో కీ.శే.ఆచార్యా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

సంగెం మండల కేంద్రంలో కీ.శే.ఆచార్యా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

సంగెం మండల కేంద్రంలో కీ.శే.ఆచార్యా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

సెప్టెంబర్ 21.ప్రజావాణి న్యూస్/ సంగెం

సంగెం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో ప్రముఖ స్వతంత్ర సమరయోధులు తెలంగాణ వాది కీ.శే. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కిచిత్రపటానికి పూలమాల పువ్వులువేసి ఘనంగా వర్ధంతి వేడుకలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించటము జరిగింది. ఈ సందర్భంగా.సంగెం సర్పంచ్.పేర్ల లలిత రమేష్ మరియు తెలంగాణరాష్ట్ర పద్మశాలి సంఘం అధికార ప్రతినిధి కందగట్ల నరహరి మాట్లాడుతూ
ప్రముఖ స్వాతం త్ర్య సమరయోధుడు, తెలంగాణ తోలితరం ఉద్యమకారుడు, మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో రాజీపడకుండా హైదరాబాదు నడి ఒడ్డున జలదృశ్యంలోని తన సొంత భూమిని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనె ఆశయంగా పోరాటంలో ప్రజలందరి నిలువ నీడ కోసం తృణప్రాయంగా ఇచ్చిన తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు.మూడు తరాల ఉద్యమ నాయకుడు,తెలంగాణే శ్వసగా తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసి ,90 ఏళ్ళు వయసులో జంతర్ మాతర్ వద్ద ఎముకలు కొరికే చలిలో దీక్ష చేసిన గొప్ప తెలంగాణ వాది ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు,మనందరం పోరాడి తరువత ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ లోకొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మనమిచ్చే ఘన నివాళులు కీర్తి ప్రతిష్టలు అన్నారు.ఈ కార్యక్రమంలో ఆగ పాటి రాజు ఉపసర్పంచ్ సంగెం పద్మశాలి సంఘం అధ్యక్షులు బిట్ల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ బాబు గుండేటి,మాజీ ఎంపిటిసి పులి వీరస్వామి,మునుకుంట్ల మోహన్, కోడూరి సదయ్య, పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఇప్ప కాయల రమేష్ బాబు,ప్రధాన కార్యదర్శి ఇప్ప కాయల మనోహర్ ,కమిటీసభ్యులు బిట్ల రామకృష్ణ,కందకట్ల వెంకటేశ్వర్లు కందకట్ల సంపత్ ,ఇప్ప కాయల విజయ్ ప్రకాష్,అవధూత వెంకటేశ్వర్లు,పేరాల లక్ష్మీ నరసయ్య ,బిట్ల లక్ష్మణ్ ,బిట్ల శ్రీను,బిట్ల వేణు, నల్ల రాజు , నల్లశంకర్, చిందం వీరస్వామి,పులిపాటి మధు,ఇప్పకాయల రవి,రాజా,నరేందర్, కటకం బిక్షపతి
పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.