తక్కువ నీటితో అధిక ఆదాయమే లక్ష్యం.. రైతులు ఆరుతడి,పంటల వైపు మళ్లాలి.
విత్తనమేళలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పిలుపు.
మహబూబాబాద్, కేసముద్రం జులై 27, ప్రజావాణి.

వాతావరణ మార్పులు, తగ్గుతున్న వర్షపాతం, భూగర్భ జలాల క్షీణత వంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకుని రైతులు సంప్రదాయ వరి సాగుకు బదులుగా పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల ఆరోగ్యం, ఆహార భద్రత, రైతుల ఆర్థికాభివృద్ధి కోసం పంటల వైవిధ్యమే శాశ్వత పరిష్కారమని ఆమె స్పష్టం చేశారు.
సోమవారం మహబూబాబాద్ పట్టణంలోని ఏటిగడ్డ తండ రైతు వేదికలో నిర్వహించిన విత్తనమేళాను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్తో కలిసి ప్రారంభించిన కలెక్టర్, జిల్లాలో ప్రాజెక్ట్ వైవిధ్యం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన విత్తనాల ప్రదర్శన స్టాల్స్‌ను సందర్శించి రైతులతో నేరుగా మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను పంపిణీ చేశారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావం… పంటల ఎంపికలో జాగ్రత్తలు అవసరం : ఎమ్మెల్యే
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ, సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గిపోవడంతో పాటు నీటి వనరులు కూడా పరిమితంగా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు వరిపై ఆధారపడకుండా ఆరుతడి పంటలు, కూరగాయల సాగు చేపడితే తక్కువ పెట్టుబడితో మెరుగైన ఆదాయం పొందవచ్చన్నారు.
ప్రతి రైతు తన పొలంలో సాధ్యమైనంత వరకు పంట మార్పిడి ఏర్పాటు చేసుకోవాలని సూచించిన తకూడా తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసి కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నానని తెలిపారు. సేంద్రియ ఎరువుల వినియోగాన్ని పెంచి, ఆరోగ్యకరమైన వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలని కోరారు.
పంటల వైవిధ్యంతోనే సుస్థిర వ్యవసాయం : కలెక్టర్
జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలే రైతులకు భరోసా కల్పిస్తాయని పేర్కొన్నారు. అందుకే వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖల సమన్వయంతో జిల్లావ్యాప్తంగా ప్రాజెక్ట్ వైవిధ్యం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
వ్యవసాయ విస్తరణ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు గ్రామ గ్రామాన రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, స్థానిక పరిస్థితులకు అనుగుణమైన పంటలపై రైతులకు మార్గనిర్దేశం చేస్తున్నారని చెప్పారు.
వరిసాగుతో పెరుగుతున్న సమస్యలు… ప్రత్యామ్నాయ పంటలకే ప్రాధాన్యం.
అధిక వరి సాగు వల్ల భూసారం క్షీణించడం, అధిక రసాయన ఎరువుల వినియోగం, నిల్వ, రవాణా, మిల్లింగ్ వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయని కలెక్టర్ వివరించారు. అదే సమయంలో పసుపు, వేరుశనగ వంటి పంటల సాగు తగ్గిపోవడంతో వాటి ఆధారిత పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు, ఆయిల్ పామ్, కూరగాయలు, పండ్లు, పూలు, మల్బరీ, మునగ, ఉల్లి వంటి పంటలను సాగు చేస్తే రైతులకు మెరుగైన ఆదాయంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని సూచించారు.
పంట, మునగ తోటలకు ప్రోత్సాహం.
వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులు పంటఏర్పాటు చేసుకోవడంతో పాటు మునగ తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని కలెక్టర్ తెలిపారు. అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందుబాటులో ఉంచుతున్నామని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం ముగింపులో హాజరైన రైతులతో ఆరుతడి పంటలు, కూరగాయల సాగు, పంట మార్పిడి విధానాన్ని పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయచంద్ర, ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి జినుగు మరియన్న, స్థానిక సర్పంచులు, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ తరాల కోసం పంట మార్పిడి… మహబూబాబాద్‌లో ప్రాజెక్ట్ వైవిధ్యంకు శ్రీకారం.