📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialగెస్ట్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

గెస్ట్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

**

*మన ప్రజావాణి*
జూలై 27
జిల్లాలోని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ బిఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం సబ్జెక్టు, పీజీ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియంలో బోధించడానికి ఇంగ్లీష్ మీడియం బ్యాక్ గ్రౌండ్ కలిగిన అభ్యర్థులు జూలై 29లోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ సోమవారం ప్రకటనలో కోరారు. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 50శాతం) మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. పీహెచ్డీ, నెట్, సెట్ వంటి అత్యున్నత విద్యార్హతలు కలిగిన వారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఈ సబ్జెక్టు బోధించే అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం సైతం ఉండాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ, డెమోలను మంచిర్యాలలోని ప్రభుత్వ ఐడి డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐడి కళాశాల ప్రిన్సిపాల్ ఆదేశాల మేరకు ఇంటర్వ్యూ, డెమో తేదీలను అభ్యర్థులకు తెలియజేస్తామన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9959269975 లో సంప్రదించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.