📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadఊరికి ఊటకుంట,పొలానికి పంట కుంట,ఇంటికి ఇంకుడు గుంత - జలసిరి లక్ష్యం.

ఊరికి ఊటకుంట,పొలానికి పంట కుంట,ఇంటికి ఇంకుడు గుంత – జలసిరి లక్ష్యం.

📰 Generate e-Paper Clip

ఊరికి ఊటకుంట,పొలానికి పంట కుంట,ఇంటికి ఇంకుడు గుంత – జలసిరి లక్ష్యం.

నీళ్లను డబ్బులాగా ఖర్చు చేయాలి.

జలసిరిపై ఎంపీడీవోలు జీ.విష్ణు,చందర్ నాయక్ పిలుపు.

కోటగిరి/ప్రజావాణి:-డబ్బులు నీళ్లలాగా ఖర్చు పెట్టే నానుడి నుండి నీళ్లను డబ్బులాగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని కోటగిరి,పోతంగల్ ఎంపీడీవోలు జి.విష్ణు,చందర్ నాయక్ అన్నారు.సోమవారం కోటగిరి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జలసిరి కార్యక్రమంపై ఎంపీడీవో అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సమావే శంలో కోటగిరి,పోతంగల్ మండలాలకు చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు,మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీడీవో విష్ణు,చందర్ నాయక్ మాట్లాడుతూ.గ్రామాలలో జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మహిళా సంఘాల సహకారం ఎంతో అవసరమని ఎంపీడీవో తెలిపారు.ప్రతి గ్రామంలో నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు.ఊరికి ఊటకుంట,పొలానికి పంట కుంట,ఇంటికి ఇంకుడు గుంత ఏర్పాటయ్యే విధంగా కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.ఈ లక్ష్యాల సాధనకు గ్రామ కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు,మహిళా సంఘాలు సమన్వయంతో పని చేయాలని కోరారు.జలసిరి విజయానికి మహిళా సంఘాల సహకారం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జి.విష్ణు,పోతంగల్ మండల స్పెషల్ ఆఫీసర్ మున్ని నాయక్,కోటగిరి ఏపీఎం భాస్కర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ధనరాజ్,ఏపీవో గంగారం,కోటగిరి,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 40;

పోతంగల్ మండలాలకు చెందిన జీ.పి.కార్యదర్శులు,ఫీల్డ్ అసిస్టెంట్లు,మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.