📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్పాథాలజిస్టు లేకుండానే ల్యాబ్‌లు MD సంతకం పేరుతో మోసం - ములుగు జిల్లా మండలలో దందా

పాథాలజిస్టు లేకుండానే ల్యాబ్‌లు MD సంతకం పేరుతో మోసం – ములుగు జిల్లా మండలలో దందా

📰 Generate e-Paper Clip

పాథాలజిస్టు లేకుండానే ల్యాబ్‌లు
MD సంతకం పేరుతో మోసం – ములుగు జిల్లాలో దందా
ములుగు ప్రతినిధి (ప్రజావాణి)

ల్యాబ్ నడపాలంటే పాథాలజిస్టు నిర్ధారణ తప్పనిసరి అని నిబంధనలు చెబుతున్నాయి.
DMLT/MLT చేసిన సిబ్బంది టెస్టులు చేసినా, చివరకు MD పాథాలజిస్టు సంతకం లేకుండా రిపోర్ట్ చెల్లదు.
కానీ ములుగు జిల్లా వ్యాప్తంగా చాలా ల్యాబ్‌లలో ఈ నిబంధనలు గాలికొదిలేస్తున్నారు.
అనుసంధానం లేని వైద్య ఆరోగ్య సంస్థల్లో కూడా ఎలాంటి నిపుణుల పర్యవేక్షణ లేకుండా ల్యాబ్‌లు నడుస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
DMLT చేసిన వారే స్వయంగా రిపోర్టులు ఇచ్చి, పైకి MD పేరుతో సంతకం పెడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
దీనివల్ల తప్పుడు రిపోర్టులు వచ్చి రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వాపోతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఎన్ని ల్యాబ్‌లకు అనుమతులు ఉన్నాయి?
ఎంతమంది అర్హత కలిగిన పాథాలజిస్టులతో నడుస్తున్నాయి?
ఎంతమంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో వైద్య ఆరోగ్య శాఖ వివరాలు బయటపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వెంటనే అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.