📄 ePaper
Monday, July 27, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialపర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత

📰 Generate e-Paper Clip

*పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత*

* *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 25

భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ మనందరి సామాజిక బాధ్యతగా భావించాలని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవా తెలిపారు. ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సుద్దాల ప్రభుదేవా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ వంతుగా కనీసం ఒక మొక్కను నాటి, వాటిని సంరక్షించాలని కోరారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ఎదుర్కొన్న అనేక విపత్తులు పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను గుర్తు చేశాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ జిల్లా అధ్యక్షుడు నందిపాట రాజ్‌ కుమార్, జిల్లా కార్యదర్శి గాండ్ల సంజీవ్, మండల అధ్యక్షుడు సకినాల శంకర్, మద్దెల సంజీవ్, జావీద్ పాషా, పృథ్వి, దిలీప్, కుమారస్వామి, పప్పు వినోద్, అరం సతీష్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular