పోరుమామిళ్ల (జులై 25 ప్రజావాణి ) గిరి నగర్ ఐదవ వార్డు దళిత వాడలైన నటువంటి గిరి నగర్ కాలనీలలో సిపిఎం పార్టీ సామాజిక శంఖారావం పేరుతో దళితవాడల్లో సందర్శించిన సందర్భంగా అక్కడ వీధి కరెంటు సమస్యలు మురికి వాడ సమస్యలు రోడ్డు సమస్యలు లాల కొన్ని రకాలైనటువంటి మౌలిక వసతులు సమస్యలపై అక్కడ ప్రజలు వివరించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి యన్ భైరవ ప్రసాద్ ఐ టి యు మండల అధ్యక్షుడు సోమయ్య సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ గౌసియా బేగం ఇరువురు సంయుక్తంగా మాట్లాడుతూ.1దళితుల స్మశాన సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన జీవో 1235 అమలు చెయ్యాలి.2 జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలు చెయ్యాలి.3. కోనేరు రంగారావు కమీషన్ సిఫారసులు అమలు చేసి భూమి లేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు భూమి ఇవ్వాలి.4కులాంతర వివాహాల రక్షణ చట్టం తీసుకురావాలి.మతం పేరుతో వేధింపులు ఆపాలి.5. ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసుల్లో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తూ పెత్తందారుల కొమ్ము కాస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.6.దళిత పేటల్లో మూసివేసిన ప్రాథమిక పాఠశాలలు పునరుద్ధరించాలి.7.పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచాలి. పిల్లల ఆరోగ్య బాధ్యతతీసుకోవాలి.పెండింగ్లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు విడుదల చెయ్యాలి.8. దళిత మహిళలను కించపరుస్తూ మాట్లాడే అహంకార భాషను అరికట్టాలి.9.ఎస్సీ, ఎస్టీ సబ్న్ చట్టాన్ని అమలు చేసి,ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలి.10.బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చెయ్యాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ పునరుద్ధరించాలి.11.దళిత క్రైస్తవులకు ఎసిసి హోదా కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చెయ్యాలి.12. గ్రామీణ ఉపాధి హామీ చట్టం (వీబీ-జీరామ్ జీ) పనులు కల్పించాలి,13.దళితులకిచ్చిన భూములకు పట్టాలిచ్చి, ఆన్లైన్లో పొందుపరచి, రైతు భరోసా ఇవ్వాలి.14.దళితుల వార్డులొ వెంటనే కరెంటు సమస్య పరిష్కరించాలి.ఈ సందర్భంగా సంఘం పోరుమామిళ్ల సిపిఎంమండల కార్యదర్శ యన్ భైరవ ప్రసాద్, సిఐటియు మండల అధ్యక్షులు సోమయ్య, సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు షేక్.గౌసియాబేగం సంయుక్తంగా వారు మాట్లాడుతూ దళితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.దళితుల కాలనీలలో సిమెంట్ రోడ్లను వెంటనే కల్పించాలని డ్రైనేజీ వ్యవస్థను పునరుద్దించాలని కరెంటు పోలులను వెయ్యాలని వారన్నారు గిరి నగర్ లోని ఐదో వార్డుకు సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థను చూస్తే చాలా చాలా ఘోరంగా ఉందని అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ చెరువు చెరువుల అనిపిస్తుందన్నారు డ్రైనేజీ అక్కడే ఉంటే మలేరియా డెంగు టైఫాయిడ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కరోనా ఇవన్నీ జబ్బులు వెంటనే వస్తాయని ఈ డ్రైనేజీ వ్యవస్థను వెంటనే పంచాయతీ అధికారులు ఎండిఓ పరిశీలించి డ్రైనేజీ లో ఉన్నటువంటి ఆ చెత్తాచెదారాన్ని వెంటనే క్లీన్ చేయాల్సింది బాధ్యత అధికారులకు ఉందని వారన్నారు ఆ డ్రైనేజీలో ఉన్నటువంటి చెత్త చదారాన్ని కలుసతమైనటువంటి కూడా నిర్మూలన చేయాల్సింది అధికారులేనని వారన్నారు దళితుల స్మశాన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1235ను వెంటనే అమలు చేయాలని, జస్టిస్ పున్నయ్య కమిషన్, కోనేరు రంగారావు కమిషన్ సిఫార్సులను అమలు చేసి భూమిలేని ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహాలకు రక్షణ కల్పించే చట్టం తీసుకురావడంతో పాటు మతం పేరుతో జరుగుతున్న వేధింపులను అరికట్టాలని కోరారు.ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అత్యాచార కేసుల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానుకుని బాధితులకు న్యాయం చేయాలని, పెత్తందారులకు కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. దళితవాడల్లో మూసివేసిన ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరించాలని,హాస్టల్ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లను పెంచి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.దళిత మహిళలను కించపరిచే వ్యాఖ్యలను అరికట్టాలని,ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని సమర్థంగా అమలు చేసి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాలని కోరారు.బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయడంతో పాటు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిళ్లను పునరుద్ధరించాలని అన్నారు.దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తగిన పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. దళితులకు కేటాయించిన భూములకు పట్టాలు మంజూరు చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేసి రైతు భరోసా వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దళితుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పోరుమామిళ్ల మండల కమిటీ సభ్యులు మేరీ,బీబీ, మేకల బాల వీరయ్య రాజు,జేమేషు బడే పీరా అభినందనలతో.యన్. భైరవ ప్రసాద్ సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి పాల్గొన్నారు,
సామాజిక శంఖారావం పేరుతో దళితవాడలో సందర్శించిన సిపిఎం సిఐటియు నాయకులు.
0
13
Previous article



