📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaనీట్  సీబీఎస్‌ఈ పరీక్షల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి

నీట్  సీబీఎస్‌ఈ పరీక్షల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి

📰 Generate e-Paper Clip

నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి

విద్యార్థులపై పోలీసు చర్యను ఖండిస్తూ దేశా వ్యాప్తంగా విద్యా సంస్థల బంధు విజయవంతం

విద్యార్థుల సమస్యలకు లాఠీచార్జ్ సమాధానం కాదు

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కళాశాల బంద్ విజయవంతం


సిరిసిల్ల, ప్రజావాణి

నీటు సి బి ఎస్ ఎస్ ఈ పరీక్షల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరుపలని ఏ ఐ ఎస్ ఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కుర్ర రాకేష్ అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…నీట్, సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, పేపర్ లీకేజీలపై బాధ్యత వహించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలకు వారు మద్దతు తెలిపారు.ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఘటనల్లో గాయపడిన విద్యార్థులు, నిరసనకారులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. ప్రజాస్వామ్య దేశంలో తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలియజేయడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతి పౌరుడి హక్కు అని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన ప్రభుత్వం పోలీసు బలప్రయోగానికి పాల్పడటం బాధాకరమని విమర్శించారు. యువత భవిష్యత్తును నిర్ణయించే పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం కోరడం నేరం కాదని స్పష్టం చేశారు.ఢిల్లీలో జరిగిన ఘటనలపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని, అనవసరంగా లేదా మితిమీరిన బలప్రయోగానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదుపులోకి తీసుకున్న విద్యార్థులు, నిరసనకారుల హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరారు. విద్యార్థుల ప్రశ్నలకు లాఠీచార్జ్ సమాధానం కాదని, ప్రభుత్వం మౌనం వీడి వారి సందేహాలకు సమాధానం చెప్పాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థి ప్రతినిధులతో తక్షణమే చర్చలు జరిపి, వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో  జిల్లా నాయకులు జిల్లా గర్ల్స్ కన్వీనర్ బర్రెంకల శ్రీహారిక విద్యార్థులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.