ఆంధ్ర ఆరోగ్య నిధి పైలట్ ప్రాజెక్టును విజయవంతం చేద్దాం……..
అనంత పురం జూలై 22 మన ప్రజా వాణి
ఆరోగ్య సేవలను సకాలంలో , అత్యవసర సమయాల్లో బాధితులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆంధ్ర ఆరోగ్య నిధి కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలాన్ని ఎంచుకున్నట్లు బాధిత హక్కు దారుల సమావేశం వెల్లడిచ్చింది. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత శాఖలైన డిఆర్డిఏ, సేర్ఫ్, స్వస్తి, వైద్య ఆరోగ్యశాఖ లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇంచార్జ్ జిల్లా వైద్యాధికారి శ్రీనివాసరెడ్డి ఈ సమావేశంలో ఆంధ్ర ఆరోగ్య నిధి పథకం , అమలు విధానాలు, గ్రామస్థాయిలో స్వయం సహాయక సంఘాల పాత్ర గురించి వివరించారు. ప్రజల భాగస్వామ్యం, ఆరోగ్య అవగాహన, స్క్రీనింగ్, బాధితులు తరలింపు, డిజిటల్ ట్రాకింగ్ తదితర అంశాలపై అవలంబించవలసిన విధానాలను నెట్వర్క్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాధితులకు సకాలంలో ఆరోగ్య సేవలు అందడానికి సమన్వయముతో పని చేయాలని తమ తమ పని లక్ష్యాలను అన్ని శాఖలు నిర్ణయించుకోవాలని కోరారు. ఆరోగ్య వ్యవస్థను బలోపితం చేయడానికి ఆంధ్ర ఆరోగ్య నిధి బాగా ఉపయోగపడుతుందని సమావేశంలో అధికారులు అభిప్రాయపడ్డారు . ఆంధ్ర ఆరోగ్య నిధి పై వివిధ శాఖల అధికారులు వెలుబుచ్చిన ప్రశ్నలకు స్టేక్ హోల్డర్ సపోర్ట్ నెట్వర్క్ అధికారులు విధి విధానాలు వివరించారు. బుక్కరాయ సముద్రం మండలంలో”” ఆన్ ”పథకం విజయవంతం అయితే రాష్ట్రమంతా విస్తరిస్తారని నెట్వర్క్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఆంధ్ర ఆరోగ్య నిధి పైలెట్ ప్రాజెక్టును విజయవంతం చేద్దాం
RELATED ARTICLES




