📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్గార్లదిన్నె పరిసర ప్రాంతాల్లో పేకాట శిబిరంపై పోలీసుల దాడి: 11 మంది జూదరుల అరెస్ట్, రూ....

గార్లదిన్నె పరిసర ప్రాంతాల్లో పేకాట శిబిరంపై పోలీసుల దాడి: 11 మంది జూదరుల అరెస్ట్, రూ. 53,700 నగదు స్వాధీనం

📰 Generate e-Paper Clip

అనంతపురం జిల్లా గార్లదిన్నె జులై 13 (ప్రజావాణి ప్రతినిధి సురేష్) మండలంలో పోలీసులు జూదరుల ఆటకట్టించారు. మండల పరిధిలోని ఎర్రగుంట్ల గ్రామ పరిసర పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట శిబిరంపై గార్లదిన్నె పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 11 మంది వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని, వారి వద్ద నుండి రూ. 53,700/- నగదును, జూదానికి ఉపయోగించిన సామాగ్రిని మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారంతో దాడులు:ఎర్రగుంట్ల గ్రామ పరిసరాల్లోని పొలాల్లో కొందరు వ్యక్తులు చేరి పెద్ద ఎత్తున జూదం (పేకాట) ఆడుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీనిపై స్పందించిన స్థానిక పోలీస్ అధికారులు తమ సిబ్బందితో కలిసి సదరు ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన జూదరులను వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన జూదరుల వివరాలు:పోలీసుల విచారణలో పట్టుబడిన వారి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:1. శ్యామగారి విజయభాస్కర్ రెడ్డి (ఈ పేకాట శిబిర నిర్వాహకుడు)
2. ధరూరు చంద్రశేకర్ (కమలాపురం కొట్టాల)
3. పెమ్మాక సుదీర్ రెడ్డి (తరిమెల)
4. కిలారి సూర్యనారాయణ (సిరివరం)
5. సొంటి సతీష్ (బుడెడు)
6. కొండాపురం రవీంద్ర రెడ్డి
7. సద్దల పెద్ది రెడ్డి
8. పోస నాగప్ప (కల్లూరు)
9. వేముల బద్రీనాథ్ (కల్లూరు)
10. షేక్ మహబూబ్ బాషా అలియాస్ డిష్ బాషా (కల్లూరు)
11. కోవిలద్దినే లక్ష్మికాంత్ రెడ్డి (గజరాంపల్లి) ఈ దాడి అనంతరం గార్లదిన్నె పోలీస్ స్టేషన్ అధికారులు మాట్లాడుతూ.. మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు సాగినా సహించేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువతను, కుటుంబాలను ఆర్థికంగా నాశనం చేసే జూదం, పేకాట వంటి వ్యసనాలకు ఎవరైనా పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ నిర్వాహణలపై ప్రజలు సమాచారం అందించాలని కోరారు. పట్టుబడిన 11 మందిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.