📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyజిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం

జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

•జిల్లా కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు జర్నలిస్టులకు ఘన సన్మానం

*సీనియర్ జర్నలిస్టులు రామారావు, అశ్వక్, రమేష్, రాజశేఖర్ ఆధ్వర్యంలో అభినందన సభ

పటాన్‌చెరు, జూలై 13 (ప్రజావాణి): టీయూడబ్ల్యూజే (ఐజేయూ) సంగారెడ్డి జిల్లా నూతన కమిటీలో ఎన్నికైన పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన జర్నలిస్టులను సోమవారం పటాన్‌చెరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. సీనియర్ జర్నలిస్టులు రామారావు, అశ్వక్, రమేష్, రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, మాజీ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు అబ్దుల్ బాసిత్, జిల్లా ప్రధాన కార్యదర్శి రుమాండ్ల అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు పర్చ శ్రీనాథ్, సంయుక్త కార్యదర్శులు కే. శ్రీనివాస్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి బసవేశ్వర్, ఈసీ సభ్యులు సయ్యద్ మజీద్ అలీ, మైకోటి శ్రీనివాస్ తదితరులను శాలువాలతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అక్రిడిటేషన్, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో జర్నలిస్టులకు వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టులు సంఘటితంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
నూతన జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, తమపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వంతో పాటు సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు. సభ్యుల సహకారంతో సంగారెడ్డి జిల్లా కమిటీని రాష్ట్రంలోనే ఆదర్శ కమిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ సీనియర్ జర్నలిస్టులు రామారావు, అశ్వక్, రమేష్, రాజశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు, సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.