గార్లదిన్నె పరిసర ప్రాంతాల్లో పేకాట శిబిరంపై పోలీసుల దాడి: 11 మంది జూదరుల అరెస్ట్, రూ. 53,700 నగదు స్వాధీనం
అనంతపురం జిల్లా గార్లదిన్నె జులై 13 (ప్రజావాణి ప్రతినిధి సురేష్) మండలంలో పోలీసులు జూదరుల ఆటకట్టించారు. మండల పరిధిలోని ఎర్రగుంట్ల గ్రామ పరిసర పొలాల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట శిబిరంపై గార్లదిన్నె పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 11 మంది వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని, వారి వద్ద నుండి రూ. 53,700/- నగదును, జూదానికి ఉపయోగించిన సామాగ్రిని మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు:ఎర్రగుంట్ల గ్రామ పరిసరాల్లోని పొలాల్లో కొందరు వ్యక్తులు చేరి...