📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriచౌదరిగూడ 380 పోలింగ్ బూత్‌లో ఎమ్మార్వో ఆకస్మిక తనిఖీ

చౌదరిగూడ 380 పోలింగ్ బూత్‌లో ఎమ్మార్వో ఆకస్మిక తనిఖీ

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్ మండలంలోని చౌదరిగూడ గ్రామం 380 పోలింగ్ బూత్‌ను ఘట్కేసర్ ఎమ్మార్వో శ్రీ శేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీఎల్‌వో మంజుల, బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)గా విధులు నిర్వహిస్తున్న కే. వినోద్ కుమార్‌ను బూత్‌కు సంబంధించిన వివరాలు, ఓటరు నమోదు ప్రక్రియ, ప్రజలకు పంపిణీ చేస్తున్న దరఖాస్తు ఫారాలు, వాటి నిర్వహణ తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు అవసరమైన అన్ని ఫారాలను అందుబాటులో ఉంచి, ప్రతి ఒక్కరికీ అందజేస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న తీరును ఎమ్మార్వో శ్రీ శేఖర్ అభినందించారు. అలాగే ప్రజల నుంచి నింపిన ఫారాలు సకాలంలో తిరిగి అందేలా మరింత చొరవతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ నాయకుడు పాలడుగుల అమరేందర్ రెడ్డి పాల్గొని, పరిధిలోని తొమ్మిది పోలింగ్ బూత్‌లకు సంబంధించిన వివరాలను ఎమ్మార్వోకు వివరించారు.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రతి కార్యకర్త, ప్రతి బీఎల్ఏ నిబద్ధతతో పనిచేయాలని అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.