📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyమాజీ సర్పంచ్ ఏర్పుల కృష్ణ సతీమణి మృతికి బీఆర్ఎస్ నేతల సంతాపం

మాజీ సర్పంచ్ ఏర్పుల కృష్ణ సతీమణి మృతికి బీఆర్ఎస్ నేతల సంతాపం

📰 Generate e-Paper Clip

మాజీ సర్పంచ్ ఏర్పుల కృష్ణ సతీమణి మృతికి బీఆర్ఎస్ నేతల సంతాపం

పటాన్‌చెరు,జూలై 7(ప్రజావాణి): కృష్ణారెడ్డిపేట గ్రామ మాజీ సర్పంచ్ ఏర్పుల కృష్ణ గారి సతీమణి శ్రీమతి ఏర్పుల విజయలక్ష్మి గారి మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. విజయలక్ష్మి గారు పరమపదించిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి కలిసి వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఏర్పుల కృష్ణతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ విషాద సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. విజయలక్ష్మి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ తీవ్ర దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ సానుభూతిని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.