📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ పారిశుధ్యంపై ఏది? బద్వేల్ మున్సిపాలిటీపై ప్రజల ఆగ్రహం!

పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ పారిశుధ్యంపై ఏది? బద్వేల్ మున్సిపాలిటీపై ప్రజల ఆగ్రహం!

📰 Generate e-Paper Clip

బద్వేల్:జూలై 07 ప్రజావాణి ప్రజల నుంచి లక్షలాది రూపాయల పన్నులను ముక్కుపిండి వసూలు చేస్తున్న బద్వేల్ మున్సిపల్ అధికారులు, కనీస పారిశుధ్య సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారుల మరియు కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పట్టణ ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంగా మారింది.డ్రైనేజీ పూడికతీత పనుల్లో ఘోర నిర్లక్ష్యం బద్వేల్ నెల్లూరు రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో మున్సిపల్ సిబ్బంది ఇటీవల కాలువలలోని పూడికలను (మురికిని) బయటకు తీశారు.అయితే,తీసిన మురికిని అక్కడి నుంచి తరలించకుండా రోడ్డు పక్కనే అలాగే వదిలేశారు.దీనివల్ల చిన్నపాటి వర్షం పడినా,ఆ మురికి అంతా తిరిగి అదే కాలువల్లోకి చేరి మురుగునీటి ప్రవాహానికి అడ్డుపడుతోంది.ఫలితంగా,మురుగునీరు మెయిన్ రోడ్డుపైనే ప్రవహిస్తూ చెరువును తలపిస్తోంది.రహదారిపై నిలిచిన మురుగునీటి వల్ల ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది.స్థానికులు,వాహనదారులు ముక్కులు మూసుకుని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది.పేరుకుపోయిన చెత్తకుప్పలు.పట్టించుకోని సిబ్బంది రహదారుల పక్కన చెత్తాచెదారం కుప్పలుగా పేరుకుపోతున్నా మున్సిపల్ సిబ్బంది కన్నెత్తి చూడటం లేదు.దీనిపై స్థానిక ప్రజలు,వ్యాపారులు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.”మేము పనులు చేయం,ఏం చేసుకుంటారో చేసుకోండి”అన్న చందంగా కింది స్థాయి సిబ్బంది బాధ్యతారహితంగా మరియు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
కమిషనర్ ఆదేశాలకే దిక్కులేదు!
పట్టణంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని మున్సిపల్ కమిషనర్ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ చేసినప్పటికీ,కింది స్థాయి సిబ్బంది వాటిని అస్సలు లెక్కచేయడం లేదు.అధికారుల మధ్య సమన్వయ లోపం,సిబ్బందిపై పర్యవేక్షణ కరువడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని స్పష్టమవుతోంది.

దోమలు,ఈగలకు నిలయంగా బద్వేల్ మున్సిపాలిటీ చేతగానితనం వల్ల పట్టణం మొత్తం దోమలు, ఈగలకు ఆవాసంగా మారింది.డెంగ్యూ,మలేరియా,టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.పన్నులు కడుతున్నా కనీస శుభ్రత పనులు కూడా చేయని ఈ వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.ఇలాంటి నిర్లక్ష్య అధికారులు,సిబ్బంది ప్రవర్తన వల్ల బద్వేల్ పట్టణానికి చెడ్డపేరు వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మున్సిపల్ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తక్షణమే స్పందించి,నెల్లూరు రోడ్డులోని మురుగునీటి సమస్యను పరిష్కరించి,చెత్తను తొలగించకపోతే.పట్టణ ప్రజలందరినీ సమీకరించి మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళనలు,ధర్నాలు చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.