📄 ePaper
Tuesday, July 7, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriస్ట్రీట్ లైట్ల సమస్య పరిష్కారానికి చర్యలు

స్ట్రీట్ లైట్ల సమస్య పరిష్కారానికి చర్యలు

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 6: మండలంలోని పలు కాలనీల్లో వీధి దీపాలు పనిచేయక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ తెలిపారు.

కొత్త స్ట్రీట్ లైట్లు అందుబాటులోకి రావడానికి సుమారు 10 నుంచి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారని ఆయన పేర్కొన్నారు. లైట్లు వచ్చిన వెంటనే ప్రతి కాలనీలో అవసరమైన ప్రాంతాల్లో వీధి దీపాల ఏర్పాటు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ నేపథ్యంలో ప్రజలు కొంత సహనంతో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని, కాలనీల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు నిరంతరం కృషి చేస్తామని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular