📄 ePaper
Tuesday, July 7, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గుగ్గిళ్లలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు

గుగ్గిళ్లలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, జూలై 7 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలను గ్రామ శాఖ అధ్యక్షులు సోమలింగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఎమ్మార్పీఎస్ జెండాను అధ్యక్షులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఆశయాలను గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, సామాజిక న్యాయం కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ల మల్లయ్య, ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కొంకటి రాజయ్య,గుగ్గిళ్ల శంకరయ్య, ప్రధాన కార్యదర్శి చిట్యాల మల్లేషం, కార్యదర్శి కండె మల్లేషం తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular