పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ పారిశుధ్యంపై ఏది? బద్వేల్ మున్సిపాలిటీపై ప్రజల ఆగ్రహం!

బద్వేల్:జూలై 07 ప్రజావాణి ప్రజల నుంచి లక్షలాది రూపాయల పన్నులను ముక్కుపిండి వసూలు చేస్తున్న బద్వేల్ మున్సిపల్ అధికారులు, కనీస పారిశుధ్య సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారుల మరియు కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పట్టణ ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంగా మారింది.డ్రైనేజీ పూడికతీత పనుల్లో ఘోర నిర్లక్ష్యం బద్వేల్ నెల్లూరు రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో మున్సిపల్ సిబ్బంది ఇటీవల కాలువలలోని పూడికలను (మురికిని) బయటకు తీశారు.అయితే,తీసిన మురికిని అక్కడి...