📄 ePaper
Tuesday, July 7, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriనారపల్లి ప్రాంతంలో నిర్వహణ పనుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేత

నారపల్లి ప్రాంతంలో నిర్వహణ పనుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేత

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూలై 6: ప్రజల భద్రత, ప్రమాదాల నివారణ లక్ష్యంగా చెట్ల కొమ్మల తొలగింపు, ఫీడర్ నిర్వహణ మరియు విద్యుత్ లైన్ క్లియరెన్స్ పనులను మంగళవారం నిర్వహించనున్నట్లు నారపల్లి విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు.

33/11 కేవీ నారపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ ప్రతాప్‌సింగారం డొమెస్టిక్ ఫీడర్‌పై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొర్రెముల, వెంకటాపూర్, మక్తా, తేనెగూడెం గ్రామాలు, 2బీహెచ్‌కే కాలనీ, బాలాజీనగర్, సదాతల్లిగూడ, సుప్రభాత్ టౌన్‌షిప్, ఓయూ కాలనీ, కొర్రెముల ఎక్స్‌రోడ్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.

33/11 కేవీ ప్రతాప్‌సింగారం సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ ప్రతాప్‌సింగారం ఏజీఎల్ ఫీడర్‌పై మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొర్రెముల, వెంకటాపూర్, మక్తా, తేనెగూడెం గ్రామాల పరిధిలోని కాలనీలు, ఎల్లమ్మ కాలనీ, 2బీహెచ్‌కే కాలనీ, బాలాజీనగర్, సదాతల్లిగూడ, సుప్రభాత్ టౌన్‌షిప్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది.

విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి శాఖకు సహకరించాలని నారపల్లి ఏఈ హరినాథ్ సాగ్గు కోరారు. నిర్వహణ పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular