నారపల్లి ప్రాంతంలో నిర్వహణ పనుల కోసం విద్యుత్ సరఫరా నిలిపివేత
ఘట్‌కేసర్, జూలై 6: ప్రజల భద్రత, ప్రమాదాల నివారణ లక్ష్యంగా చెట్ల కొమ్మల తొలగింపు, ఫీడర్ నిర్వహణ మరియు విద్యుత్ లైన్ క్లియరెన్స్ పనులను మంగళవారం నిర్వహించనున్నట్లు నారపల్లి విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. 33/11 కేవీ నారపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ ప్రతాప్‌సింగారం డొమెస్టిక్ ఫీడర్‌పై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొర్రెముల, వెంకటాపూర్, మక్తా, తేనెగూడెం గ్రామాలు, 2బీహెచ్‌కే కాలనీ, బాలాజీనగర్,...