ఘట్కేసర్, జూలై 5: మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని 6వ డివిజన్లో ఆదివారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఘట్కేసర్ మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గ పరిశీలకుడు రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏల సమావేశంలో రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించి, ప్రతి అర్హ ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం మైసమ్మగుట్ట కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఫారాలను ఎలా పూరించాలి, ఏ వివరాలు నమోదు చేయాలి, నిర్ణీత గడువులోగా వాటిని ఎలా సమర్పించాలనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మేకల నర్సింగ్‌రావు, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్‌రెడ్డి, కొమ్మిడి అనురాధ రాఘవరెడ్డి, కొమ్మగోని మహిపాల్ రమాదేవి, బేతాళ నర్సింగ్‌రావు, జనగామ యాదగిరిరావు, పందిరి శశికల, ఎంపాల సుధాకర్‌రెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, అనుభయ్, విష్ణువర్ధన్‌రెడ్డి, కుతుబ్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీఎల్ఏలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.





