బీఆర్ఎస్ బీఎల్‌ఏలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన సమావేశం

ఘట్‌కేసర్, జూలై 5: మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని 6వ డివిజన్‌లో ఆదివారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఘట్‌కేసర్ మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గ పరిశీలకుడు రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏల సమావేశంలో రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించి, ప్రతి అర్హ ఓటరు వివరాలు సక్రమంగా...