📄 ePaper
Sunday, July 5, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyడ్రైనేజీ మరమ్మతు పనులను ప్రారంభించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి

డ్రైనేజీ మరమ్మతు పనులను ప్రారంభించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

డ్రైనేజీ మరమ్మతు పనులను ప్రారంభించిన….. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి

అమీన్ పూర్, జూలై (ప్రజావాణి):అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని దివ్యశ్రీ కాలనీలో కాలనీ వాసుల సొంత నిధులతో చేపడుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మరమ్మతు పనులను అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలనీవాసులు తమ సమస్యల పరిష్కారం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సొంత నిధులతో డ్రైనేజీ మరమ్మతు పనులు చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతి కాలనీలో నివాసితులు ఐక్యంగా ఉండి, కాలనీ నిధులను అదే కాలనీ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు వినియోగించేలా చర్యలు తీసుకుంటే భావితరాలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.కాలనీ అభివృద్ధి కోసం ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ఇలాంటి కార్యక్రమాలు ఇతర కాలనీలకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు లక్ష్మీకాంత్, చుక్కారెడ్డి, రామచంద్రా రెడ్డి, కృష్ణ యాదవ్, శ్రీధర్, మస్తాన్, రాము, సురేష్ నాయక్, కాలనీ అధ్యక్షులు సుఖేష్, కాలనీ పాలకవర్గం సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular