మహిళలు సాధికారత వైపు అడుగులు వేయాలి
*వయోజన విద్యాశాఖ రాష్ట్ర సంచాలకులు ఏ శ్రీనివాస్ రెడ్డి*
* *మన ప్రజావాణి*, మందమర్రి:- జులై 4
మహిళలు మహిళా సాధికారత వైపు అడుగులేయాలని వయోజన విద్యాశాఖ రాష్ట్ర సంచాలకులు ఏ శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలోని సిఈఆర్ క్లబ్లో శనివారం వయోజన విద్యాశాఖ జిల్లా ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల సఖి సహకారంతో వంద రోజుల్లో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న శిక్షకులకు కుట్టు శిక్షణ పరీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏ శ్రీనివాస్ రెడ్డి కి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహిళలు కుట్టు శిక్షణ నైపుణ్యాలను పెంచుకొని, పూర్తిస్థాయిలో వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళలు చదువును నిర్లక్ష్యం చేయరాదని, మధ్యలో మానేసిన చదువును చదువుకునేందుకు ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ లు వంటివి పూర్తి చేసేందుకు ప్రయత్నించాలన్నారు. చదువుకున్న మహిళలు చదువురాని వారికి స్వచ్ఛందంగా విద్యను నేర్పించి, వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం పరీక్ష పత్రాలను విడుదల చేసారు. వయోజన విద్యాశాఖ నిజామాబాద్ జిల్లా డైరెక్టర్ పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో జిల్లా కలెక్టర్, అధికారుల సహకారంతో ఈ శిక్షణ కేంద్రాల ఏర్పాటు చేసి, 100 రోజులు విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. మహిళలను సాధికారత వైపు మళ్లించేందుకు కుట్టు శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మంచిర్యాల ప్రాజెక్ట్ అధికారి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, మహిళల్లో నైపుణ్యాలను పెంపొందించేకునేందుకు శిక్షణ కార్యక్రమాలను వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సఖి క్లబ్ అడ్మినిస్ట్రేటర్, డిఆర్పి బండ శాంకరి, సుమన్ లు అధ్యక్షత వహించగా కుట్టు శిక్షణ కేంద్రం కో ఆర్డినేటర్ ఉప్పులేటి గోపిక, ఆర్గనైజర్ ఉప్పులేటి నరేష్, శిక్షకురాలు ఉప్పులేటి శారద లు పాల్గొన్నారు.
మహిళలు సాధికారత వైపు అడుగులు వేయాలి
RELATED ARTICLES




