📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialఅంజనీ పుత్రపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

అంజనీ పుత్రపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

📰 Generate e-Paper Clip

*అంజనీ పుత్రపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు*

*దుష్ప్రచారంపై చట్ట రీత్యా చర్యలు*

*ప్రజల నమ్మకం, ఆదరాభిమానాలే అంజనీపుత్ర బలం*

*అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి లు*
* *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జూన్ 28

రియల్ ఎస్టేట్ రంగంలో అనతి కాలంలోనే అంజనీపుత ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రజల నమ్మకాన్ని, ఆదరభిమానాన్ని చొరగొని రియల్ ఎస్టేట్ రంగంలో ఉత్తర తెలంగాణలోనే అగ్రగామిగా నిలిచిందని, తమ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది వ్యక్తులు కొన్ని సంస్థలు నకిలీ అసత్యపు వార్తలు, ప్రచారాలు చేస్తూ అంజనీపుత్రపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి దుష్ప్రచారాలను ప్రజలు, వినియోదారులు నమ్మవద్దని అంజనీపుత్ర ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి లు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని అంజనీపుత్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ,
డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే చర్యలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంజనీ పుత్ర సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశ్యంతోనే కొందరు వ్యక్తులు అసత్య ప్రచారాలు, ఫేక్ పీడీఎఫ్‌ లు, వాస్తవాలకు విరుద్ధమైన కథనాలను వాట్సాప్, ఫేస్‌ బుక్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలను సాధారణ ప్రచారంగా కాకుండా ఉద్దేశపూర్వక దుష్ప్రచారంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. అంజనీ పుత్ర సంస్థపై జరుగుతున్న ప్రచారాల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వెల్లడించారు. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు లేదా అనామక పేర్లతో వ్యవహరించినా, సాంకేతిక ఆధారాలు, డిజిటల్ ట్రాకింగ్ ద్వారా సంబంధిత వ్యక్తులను గుర్తించడం సాధ్యమేనని, సంస్థపై తప్పుడు ఆరోపణలు చేయడం, ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం, నిరాధార కథనాలు ప్రచారం చేయడం, ప్రజల్లో అపోహలు కలిగించడం వంటి చర్యలు చట్టపరంగా శిక్షార్హమని,  అదేవిధంగా  ఎలాంటి ధృవీకరణ లేకుండా తప్పుడు సమాచారాన్ని ఇతర గ్రూపుల్లో లేదా సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేసే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, దానికి అవసరమైన చర్యలు ప్రారంభించామని స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి ప్రచారాలను నమ్మే ముందు అధికారిక ప్రకటనలు, ధృవీకరించిన సమాచారం ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.అంజనీపుత్ర సంస్థ తన కార్యకలాపాలను పారదర్శకత, వినియోగదారుల విశ్వాసం, నైతిక విలువలను కేంద్రంగా చేసుకుని కొనసాగిస్తోందని తెలిపారు. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు కొనసాగితే పరువు నష్టం దావా వేయడానికి వెనుకాడబోమని తెలిపారు. ప్రజల ,వినియోగదారుల నమ్మకమే తమ బలమని, ఆ నమ్మకానికి ఎలాంటి భంగం కలగనివ్వమని భరోసా ఇచ్చారు. ఎలాంటి దుష్ప్రచారాలకు తలొగ్గకుండా పారదర్శకత, బాధ్యతతో ముందుకు సాగుతామని తెలిపారు. ఇంతకాలం ప్రజలు వినియోధాలు ఇచ్చిన అందించిన ఆధార అభిమానాలతోనే తమ సంస్థ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలతో పాటు భూపాలపల్లి, మహారాష్ట్ర లో సైతం తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి,  రియల్ ఎస్టేట్ రంగంలో తమ పయనాన్ని కొనసాగిస్తూ, వినియోగదారుల ప్రేమను ఆదరాభిమానాలు పొందుతున్నామని, ఇదే విధంగా కొనసాగించేందుకు నిరంతరం తాము, తమ సిబ్బంది కృషి చేస్తామని తెలిపారు. వినియోదారుల సంక్షేమమే ధ్యేయంగా, మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నిజం చేసేందుకు, వారి వ్యాపార స్థిరాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ, ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, సామాన్యుడికి అందుబాటు ధరలోనే ఫ్లాట్లు విక్రయిస్తూ, వారి ప్రేమను పొందుతున్నామని, ప్రజల్లో తమకున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఇటువంటి ప్రచారాలకు తెరలేపారని ఆరోపించారు. ప్రజలు ,వినియోగదారులు ఇటువంటి అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ప్రజల ప్రేమ, ఆధారభిమానాలు తమపై  ఉన్నంత కాలం అంజనీపుత్ర సంస్థ రియల్ ఎస్టేట్ రంగంలో తన ప్రస్తానాన్ని కొనసాగిస్తూ, మరింత అభివృద్ధి చెందుతూ, రాష్ట్రవ్యాప్తంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం తద్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ డైరెక్టర్లు, ఏజెంట్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.