అమీన్పూర్‌లో రేపు విద్యుత్ సరఫరా అంతరాయం
చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో వినియోగదారులకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి
అమీన్పూర్, జూన్ 23 (ప్రజావాణి): సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపట్టనున్న నేపథ్యంలో బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు అమీన్పూర్ విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
11 కేవీ లక్ష్మీ హోమ్స్ ఫీడర్ పరిధిలో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది. ఈ మేరకు కేజీఆర్ కాలనీ, ఎంఎస్ హోమ్స్, టీచర్స్ కాలనీ, పద్మావతి హోమ్స్, సత్యకృప, శ్రీనివాస్ హోమ్స్, రావు ఎన్‌క్లేవ్, త్రిపుర ఎన్‌క్లేవ్, మోదీ బిల్డర్స్, లింగమయ్య కాలనీ, ఎన్‌ఎస్‌ఎల్ కాలనీ, భవానీపురం ప్రాంతాలు ప్రభావితమవుతాయి.
అలాగే 33/11 కేవీ అమీన్పూర్ సబ్‌స్టేషన్ నుంచి సరఫరా అయ్యే 11 కేవీ ఓడీఎఫ్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.
ఈ సమయంలో ఓడీఎఫ్ కాలనీ ఫేజ్-1, ఫేజ్-2, మైత్రి వ్యాలీ, శుభం ఇన్‌ఫ్రా, అనిత రెసిడెన్సీ, ఐ-కన్వెన్షన్, అవంతిక, సాయి భగవాన్ ఎన్‌క్లేవ్, లక్ష్మీ హోమ్స్ ఏ & బి ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉండనుంది.
ఆయా కాలనీల ప్రజలు విద్యుత్ శాఖ సిబ్బందికి సహకరించాలని అమీన్పూర్ సెక్షన్ ఏఏఈ (ఆపరేషన్) ఆర్. వెంకట్ రామ్ రెడ్డి తెలిపారు.




